గురువారం 16 జూలై 2020
Sports - Jun 20, 2020 , 01:15:35

దేశంలో వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు

దేశంలో వెయ్యి ఖేలో ఇండియా కేంద్రాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను (కేఐసీ) ఏర్పాటు చేసేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నది. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఇవి దోహదపడతాయని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు శుక్రవారం అన్నారు. అన్ని జిల్లాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తామని..  నిపుణులైన కోచ్‌లు, సీనియర్‌ ఆటగాళ్లు యువతకు మార్గనిర్దేశం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని క్రీడా సూపర్‌ పవర్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. యువత క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రిజిజు అన్నారు.logo