సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 23, 2020 , 21:49:00

మూడో టెస్టులో పాక్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ శతకం

మూడో టెస్టులో పాక్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ శతకం

 సౌతాంప్టన్‌: ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో పాకిస్థాన్‌ నిలకడగా ఆడుతున్నది.  కెప్టెన్‌  అజహర్‌  అలీ(103: 205 బంతుల్లో 15ఫోర్లు) శతకంతో విజృంభించాడు.  టెస్టు కెరీర్‌లో అతనికిది 17వ శతకం కాగా కెప్టెన్‌గా రెండోది.  మరో బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అర్ధశతకంతో రాణించాడు. 75/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ  ఆదుకున్నది. ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు.   ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఇంగ్లీష్‌ సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(3/13) ధాటికి టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎక్కువసేపు నిలువలేకపోయారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు ఓవర్లు ఆడిన పాక్‌ వికెట్లకు పరుగులు చేసింది.  అలీ(104), రిజ్వాన్‌(51) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ స్కోరుకు పాక్‌ 373 పరుగులు వెనకబడి ఉంది.    అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 154.4 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్‌ 583/8  పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నిం గ్స్‌ను డిక్లేర్‌ చేసింది.logo