ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 22:29:02

Pakistan is better than England, can still win series: Inzumam

Pakistan is better than England, can still win series: Inzumam

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడు టెస్టులి సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికీ పాకిస్థాన్ జ‌ట్టుకు సిరీస్ సాధించే స‌త్తా ఉంద‌ని ఆ దేశ మాజ ఈకెప్టెన్ ఇంజ‌మాముల్ హ‌క్ పేర్కొన్నాడు. ఇప్ప‌టికీ పాక్ అత్యుత్త‌మ జ‌ట్టే అని ఇంజీ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఓట‌మి నుంచి పాఠాలు నేర్చుకొని మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అజ‌హ‌ర్ అలీ సేన దుమ్మురేపుతుంద‌ని అన్నాడు. 

ఒల్డ్‌ట్ర‌ఫోర్డ్ మైదానంలో జ‌రిగిన తొలి టెస్టులో ఆరంభం నుంచి అద‌ర‌గొట్టిన పాకిస్థాన్ చివ‌రి రోజు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. `నా దృష్టిలో ఇంగ్లండ్ జ‌ట్టు కంటే పాకిస్థాన్ మెరుగ్గా ఉంది. తొలి టెస్టు గెల‌వాల్సింది. కానీ అలా జ‌రిగింది. ఫ‌లితంతో నిరాశ చెందా. కానీ ఇప్ప‌టికీ పాక్ జ‌ట్టే సిరీస్ నెగ్గుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ ప‌రుగులు చేయ‌లేక‌పోవ‌డంతో పాక్ ఆట‌గాళ్లు కాస్త ఆందోళ‌న‌లో క‌నిపించారు. అదే ఫ‌లితంపై ప్ర‌భావం చూపింది. ఇలాంట స‌మ‌యంలో జ‌ట్టు స‌హాయ సిబ్బంది ఆట‌గాళ్లలో ఆత్మ‌విశ్వాసం నింపాలి`అని ఇంజ‌మామ్ సోమ‌వారం ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. logo