సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 22:18:21

Music to my ears: KL Rahul

Music to my ears: KL Rahul

బెంగ‌ళూరు: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ ప్రారంభానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంలో ప్లేయ‌ర్లంతా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఈసారి లీగ్ యూఏఈలో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయ‌గా.. కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్‌ రాహుల్ సోమ‌వారం అదే ప‌నిచేశాడు. 

దాదాపు ఆరు నెల‌లుగా మైదానానికి దూర‌మైన ఆట‌గాళ్లు ప్ర‌స్తుతం ఫిట్‌నెస్‌, ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. `నా చెవుల‌కు సంగీతం విన‌బడుతున్న‌ది`అని రాహుల్ ప్ర‌త్యేకమైన వీడియోను పోస్ట్ చేశాడు. దుబాయ్‌లో జ‌రుగనున్న‌లీగ్ కోసం ఆట‌గాళ్లంతా ఆతృత‌గా ఎదురుచూస్తుంటే.. ఫ్రాంచైజీలు ఏర్పాట్ల‌లో త‌ల‌మున‌క‌లై ఉన్నాయి. మ‌రోవైపు బీసీసీఐ లీగ్ స్పాన్స‌ర్ కోసం వెతుకులాట ఉంది. logo