e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home స్పోర్ట్స్ సెరెనా సాఫీగా..

సెరెనా సాఫీగా..

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. మహిళల సింగిల్స్‌లో సెరెనా జోరు కొనసాగించగా.. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్‌, థీమ్‌, జ్వెరెవ్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. కొవిడ్‌-19 ప్రభావం దృష్ట్యా విక్టోరియాలో శనివారం నుంచి లాక్‌డౌన్‌ కొనసాగనుండటంతో తదుపరి ఐదు రోజుల పాటు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే కొనసాగనున్నాయి. 

మెల్‌బోర్న్‌: నాలుగేండ్ల క్రితం ఇక్కడే తన చివరి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సెరెనా 7-6 (7/5), 6-2తో అనస్తాసియా పొటపోవా (రష్యా)పై వరుస సెట్లలో విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరింది. తొలి సెట్‌లో గట్టి పోటీనిచ్చిన 19 ఏండ్ల పొటపోవా.. రెండో సెట్‌లో సెరెనా ముందు నిలువలేకపోయింది. ‘సెరెనాను ఓడించేందుకు నా అనుభవం సరిపోలేదు. ఎక్కువగా ఆలోచించి అనవసర షాట్లు ఆడాను. అందువల్లే ఓటమి వైపు నిలిచాను’అని మ్యాచ్‌ అనంతరం 101వ ర్యాంకర్‌ పొటపోవా పేర్కొంది. 39 ఏండ్ల సెరెనా మూడో రౌండ్‌లో ఏడో సీడ్‌ సబలెంక (బెలారస్‌)తో తలపడనుంది. ఇతర మ్యాచ్‌ల్లో నవోమి ఒసాక (జపాన్‌) 6-3, 6-2తో జబేర్‌ (ట్యూనీషియా)పై.. ముగురుజా (స్పెయిన్‌) 6-1, 6-1తో దియాస్‌ (కజకిస్థాన్‌)పై.. సిమోనా హలెప్‌ (రొమేనియా) 6-1, 6-3తో కుదేర్‌మెటోవా (రష్యా)పై గెలిచి ముందడుగు వేశారు. 

థీమ్‌ చెమటోడ్చి

- Advertisement -

పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌ ఆరంభంలో తడబడ్డ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 4-6, 4-6, 6-3, 6-4, 6-4తో దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 6-3, 6-3, 6-1తో మన్నారినో (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. ఎనిమిదో సీడ్‌ స్వార్ట్‌మన్‌ (జర్మనీ) మూడో రౌండ్‌లో ఇంటిబాటపట్టాడు. 

ప్రేక్షకుల్లేకుండానే..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకోవడంతో శనివారం నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మ్యాచ్‌లు ఖాళీ మైదానాల్లో జరుగనున్నాయి. సెరెనా విలియమ్స్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన (సెప్టెంబర్‌ 11, 1999) సమయానికి పొటపోవా ఇంకా పుట్టకపోవడం గమనార్హం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement