ఆర్థిక మంత్రి హరీశ్‌రావును కోరిన సాట్స్ చైర్మన్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వార్షిక బడ్జెట్లో క్రీడలకు మరిన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును మంగళవారం సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. తెలంగాణ క్రీడా హబ్‌గా ఎదుగుతున్న క్రమంలో బడ్జెట్లో మరింత ప్రాధాన్యమివ్వాలని మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా మంది గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, దీని ద్వారా వారిని ప్రోత్సహించినట్లు ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ఖ్యాతిని పెంపొందించాలంటే క్రీడలకు పెద్దపీట వేయాలని మంత్రి హరీశ్‌రావుకు సాట్స్ చైర్మన్ విన్నవించారు.