హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. సోమవారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన పోరులోటైటాన్స్ 28-48 స్కోరుతో చిత్తుగా ఓడింది. విరామానికే జైపూర్ జట్టు 20-12తో ఆధిపత్యం ప్రదర్శించింది. జైపూర్ జట్టులో అర్జున్ అత్యధికంగా 18 పాయింట్లు సాధించగా, అంకుశ్ 6, రాహుల్ చౌదరి, అజిత్, సాహుల్ తలా 3 పాయింట్లు జోడించారు. టైటాన్స్ జట్టులో పర్వేష్ 7, హనుమంతు, మొహసీన్, ఆదర్శ్ తలా 3 పాయింట్లు సాధించారు. హోరాహోరీ సాగిన మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 33-32తో బెంగాల్ వారియర్స్‌పై విజయం సాధించింది.