అంకుల్.. క్యాప్ అలా కాదు.. ఇలా పెట్టుకోవాలి.. వీడియో

Mon,April 15, 2019 04:54 PM

చెన్నై సూపర్ కింగ్స్ ఎంతైనా కింగ్సే. ఐపీఎల్‌లో వాళ్ల పర్‌ఫార్మెన్స్ కూడా అలా ఉంది మరి. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీపై కొన్ని ఆరోపణలు వచ్చినా ఆవేమీ వాళ్ల ఆట మీద ప్రభావం చూపించడం లేదు. ఐపీఎల్ 2019లో దూసుకెళ్తోంది ఆ టీమ్. సీఎస్‌కే టీమ్‌తో పాటు ధోనీ కూతురు జీవా కూడా ట్రావెల్ చేస్తోంది. తన తండ్రితో పాటే జీవా కూడా తిరుగుతోంది. ధోనీ.. జీవాకు సంబంధించిన డ్యాన్స్ చేసే వీడియోలు, ఆడుకునే వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తుంటాడు.


తాజాగా జీవా ఫీల్డ్‌లో ఉన్న ఓ వీడియోను సీఎస్‌కే తన అఫీషియల్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌తో సీఎస్‌కే గెలిచిన తర్వాత ఫీల్డ్‌లో బ్రావోకు టోపీ ఎలా పెట్టుకోవాలో జీవా నేర్పిస్తున్న వీడియో అది. ఆ వీడియోను నచ్చిన నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఓవైపు మ్యాచ్ గెలిచిన ఆనందంలో సీఎస్‌కే టీమ్ ఉండటం, మరోవైపు జీవా బ్రావోకు టోపీ పెట్టుకోవడం నేర్పించే వీడియో క్రికెట్ అభిమానులకు నచ్చడంతో సీఎస్‌కే టీమ్ మాంచి ఊపు మీదుంది. అన్ని సీఎస్‌కేకు అనుకూలిస్తుండటంతో ఐపీఎల్ 2019 టైటిల్ గెలుపే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు.

2851
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles