వన్డేల్లో తొలి బౌండరీ.. టీమిండియా ఫుల్‌ఖుషీ: వీడియో వైర‌ల్‌

Sun,July 15, 2018 05:20 PM

Yuzvendra Chahal Raises His Bat After Hitting First-Ever ODI Boundary

లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అటు బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుతంగా రాణించింది. అన్ని రంగాల్లో ఆల్‌రౌండ్‌షో ప్రదర్శన చేసి భారత్‌పై 86 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ మూడు వన్టేల సిరీస్‌ను 1-1తో సమం చేసిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటవడంతోనే భారత్ ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. ఆతిథ్య బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ బ్యాటింగ్‌కు వచ్చాడు.

48వ ఓవర్ సమయంలో బాధలో ఉన్న టీమిండియా శిబిరంలో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ వేసిన ఓవర్‌లో చాహల్ బ్యాటింగ్ ఎండ్‌వైపు ఉన్నాడు. అతడు వేసిన బంతిని చాహల్ బౌండరీ బాదాడు. ఐతే ఈ బౌండరీ చాహల్ వన్డే కెరీర్‌లోనే తొలి ఫోర్ కావడం విశేషం. బంతి బౌండరీ వెళ్లగానే చాహల్ తన బ్యాట్‌ను ఎత్తి..డ్రెస్సింగ్ రూమ్‌వైపు అభివాదం చేశాడు. దీంతో ఒక్కసారిగా భారత్ బృందంలో నవ్వులు విరబూశాయి. తనతో పాటు అవతలి ఎండ్‌లో క్రీజులో ఉన్న కుల్దీప్ యాదవ్ పడిపడి నవ్వాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.6814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles