క్యాన్సర్ బాధితులను కలిసిన యువరాజ్

Fri,January 20, 2017 03:58 PM

Yuvraj Singh visited a cancer hospital in Cuttack

కటక్: ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన యువరాజ్ సింగ్.. మ్యాచ్ తర్వాత కటక్ లోని ఓ క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించాడు. 2011 తర్వాత క్యాన్సర్ తో బాధపడిన యువరాజ్.. కీమోథెరపీ సాయంతో ఆ మహమ్మారిని జయించిన విషయం తెలిసిందే. ఆ పోరాటం తర్వాతే యువీ.. యూవీకెన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి క్యాన్సర్ బాధితులకు సాయం చేస్తున్నాడు. అందులో భాగంగానే మ్యాచ్ ముగిసిన తర్వాత యువీ ఆ హాస్పిటల్ కు వెళ్లాడు. అక్కడి పేషెంట్లు, డాక్టర్లు యువీతో ఫొటోలు దిగడానికి, ఆటోగ్రాఫ్ లు తీసుకోవడానికి పోటీ పడ్డారు.


1730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles