యువీ అరుదైన ప్లేయ‌ర్.. వెల్లువెత్తుతున్న విషెస్‌

Mon,June 10, 2019 03:45 PM

Yuvraj Singh is a rare player to find, tweets Virendra Sehwag

హైద‌రాబాద్‌: ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు బాది.. ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పిన మేటి క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ క్రికెట్‌కు సెలవు ప్ర‌క‌టించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన యువీకి.. త‌న తోటి స‌హ‌చ‌రుల నుంచి గ్రీటింగ్ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. డాషింగ్ ఓపెన‌ర్ సెహ్వాగ్‌.. యువీని గుర్తు చేసుకున్నాడు. ప్లేయ‌ర్లు వ‌స్తుంటారు, వెళ్తుంటారు.. కానీ యువీ లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటార‌న్నాడు. ఎన్నో విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి యువీ విజేత‌గా నిలిచాడ‌న్నాడు. త‌న ఆత్మ స్థ‌యిర్యంతో ఎంతో మందికి ప్రేర‌ణ‌గా నిలిచాడ‌న్నాడు. మ్యాచ్ విన్న‌ర్ యువీ ఓ ఫైట‌ర్ అని మ‌రో మాజీ ప్లేయ‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ ట్వీట్ చేశాడు. దేశానికి నీవు అందించిన సేవ‌కు గ‌ర్వ‌ప‌డాలంటూ కామెంట్ చేశాడు. ఐసీసీ, ఈఎస్‌పీఎన్‌, స్టార్ స్పోర్ట్స్ కూడా యువీకి బెస్ట్ విషెస్ చెప్పాయి.





















3688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles