క్రికెట్‌కు యువీ గుడ్‌బై

Mon,June 10, 2019 02:08 PM

Yuvraj Singh announces retirement from international cricket

న్యూఢిల్లీ: టీమిండియా ప్రపంచకప్‌ల హీరో, సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత క్రికెట్‌కు 19ఏండ్ల పాటు సేవలందించిన యువీ 2011 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ధోనీసేన కప్ గెలవడంలో అసాధారణ పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్ విజయంలోనూ అతడు అదరగొట్టాడు. భారత్ తరఫున యువీ 40 టెస్టులు, 304 వన్డేలు, 58 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 37ఏండ్ల యువీ 2000 సంవ‌త్స‌రంలో భార‌త త‌ర‌ఫున అంత‌ర్జాతీయ‌ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2012లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన యువీ.. 2017లో ఆఖరి వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో యువరాజ్ సింగ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. రూ.కోటి కనీస ధరకే అతడిని కొనుగోలు చేసింది. 16 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఆడించింది.క్యాన్సర్‌ను జయించిన వీరుడు యువీ

2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌, బంతితో మెరిసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్'అవార్డు అందుకున్న యువీ.. టోర్నీ మ‌ధ్య‌లో క్యాన్సర్‌ ఉందని తెలిసినా క్రికెట్‌ ఆడేందుకు ఎక్కువ‌ ప్రాధాన్యతనిచ్చాడు. యువరాజ్ సింగ్ 2011 లో సెమినోమా (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి)కి గురయినపుడు అందరూ ఆందోళన చెందారు. తర్వాత అమెరికా వెళ్లి యువీ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని 'ది టెస్ట్ ఆఫ్ మై లైప్' అనే పుస్తకం రాశాడు. ప్రస్తుతం ఎప్పటి లాగే క్రీడా జీవితాన్ని గడుపుతున్నాడు. వ్యాధి నుంచి బయటపడ్డాక దూకుడు పెంచి మరీ ఆడాడు. బాలీవుడ్‌ నటి హాజెల్‌ కీచ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.4950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles