యువ‌రాజ్ 150.. ధోనీ సెంచరీ

Thu,January 19, 2017 04:00 PM

Yuvraj hits his 14th hundred in ODIs

క‌ట‌క్‌: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో వెట‌ర‌న్ బ్యాట్స్‌మెన్ యువరాజ్, ధోనీలు సెంచరీలతో చెలరేగారు. యువీకి వ‌న్డేల్లో ఇది 14వ సెంచ‌రీ కాగా.. ధోనీకి పదో సెంచరీ. తొలి వ‌న్డేలో విఫ‌ల‌మైన ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్.. కటక్ లో చెలరేగారు. త‌న ఎంపిక‌ను ప్ర‌శ్నించిన‌వారికి యువీ సెంచ‌రీతో స‌మాధాన‌మిచ్చాడు. 25 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న టీమ్‌ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. నాలుగో వికెట్ కు ఏకంగా 256 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. టీమిండియాకు భారీ స్కోరు అందించారు. యువీ 98 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకోగా.. ధోనీ 106 బంతుల్లో సెంచరీ చేశాడు.

2011లో చివ‌రిసారి సెంచ‌రీ కొట్టిన యువీ.. మ‌ళ్లీ ఆరేళ్ల త‌ర్వాత ఆ మార్క్ దాటడం విశేషం. అటు ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై తన చివరి సెంచరీ చేయగా.. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆ మార్క్ అందుకున్నాడు. ఇంగ్లండ్ పై అద్భుతమైన రికార్డు ఉన్న యువీ.. ఆ టీమ్ పై నాలుగో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో యువీ వన్డేల్లో తన అత్యుత్తమ స్కోరు కూడా సాధించాడు. గతంలో 2004లో ఆస్ట్రేలియాపై సాధించిన 139 పరుగుల స్కోరును యువీ అధిగమించాడు. వన్డేల్లో తొలిసారి 150 పరుగుల మైలురాయిని అందుకున్న యువీ.. అదే స్కోరుపై ఔటయ్యాడు.

2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles