ఇంగ్లాండ్‌పై టీమిండియా గెలుపు..

Thu,January 19, 2017 05:31 PM

Yuvi, Dhoni slam hundreds as India post massive score in Cuttack against England


క‌ట‌క్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై భారత్ 15పరుగుల తేడాతో విజయం సాధించింది. 382 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 366పరుగులతో సరిపెట్టుకుని పిచ్ నుంచి వైదొలిగింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే భారత్ 2-0తేడాతో కైవసం చేసుకుంది. ఇయాన్ మోర్గాన్ 102 పరుగులు, జాసన్ రాయ్ 82, రూట్ 54, మొయిన్ అలీ 55 పరుగులతో రాణించినా ఇంగ్లాండ్‌ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. భారత బౌలర్లు అశ్విన్ 3, బూమ్రా 2, జడేజా, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు.

ఇరగదీసిన యువీ, ధోనీ..
ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్ యువ‌రాజ్‌, ధోనీ దుమ్మురేపారు. బారాబ‌తి స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారించారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను చిత‌క్కొట్టారు. సిక్స్‌లు, ఫోర్ల వ‌ర్షంతో హోరెత్తించారు. ఒక ద‌శ‌లో 25 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న టీమిండియాకు భారీ స్కోరు అందించారు. ఈ క్ర‌మంలో యువ‌రాజ్ వ‌న్డేల్లో తొలి 150 సాధించ‌గా.. ధోనీ కూడా 134 ప‌రుగులు చేశాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి నాలుగో వికెట్‌కు 256 ప‌రుగులు జోడించ‌డం విశేషం. దీంతో ఇంగ్లండ్ ముందు 382 ప‌రుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది కోహ్లి సేన‌.

ఈ క్ర‌మంలో యువ‌రాజ్ ఆరేళ్ల త‌ర్వాత వ‌న్డేల్లో సెంచ‌రీ చేయ‌గా.. ధోనీ మూడేళ్ల మూడునెల‌ల త‌ర్వాత మూడంకెల స్కోరు అందుకున్నాడు. చాలా రోజుల త‌ర్వాత త‌న‌దైన స్టైల్లో చెల‌రేగిన యువీ సెంచ‌రీతో విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించాడు. చివరిసారి 2011 వరల్డ్ కప్ లో యువీ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో 127 బంతులు ఎదుర్కొన్న యువీ 21 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 150 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అటు ధోనీ 122 బంతుల్లో ప‌ది ఫోర్లు, ఆరు సిక్స‌ర్ల‌తో 134 ర‌న్స్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ధోనీ వ‌న్డేల్లో 200 సిక్స‌ర్లు కొట్టిన తొలి ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

తొలి వ‌న్డేల్లో విఫ‌ల‌మై విమ‌ర్శ‌ల పాలైన ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ స‌రైన స‌మ‌యంలో త‌మ స‌త్తా చాటారు. తొలి వ‌న్డే సెంచ‌రీ హీరో, కెప్టెన్ కోహ్లితోపాటు ఓపెన‌ర్లు తొంద‌ర‌గా ఔటైనా తమ అనుభ‌వంతో యువీ, ధోనీ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. యువీ మొద‌టి నుంచీ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగ‌గా.. మొద‌ట్లో నెమ్మ‌దిగా ఆడిన ధోనీ.. హాఫ్ సెంచ‌రీ త‌ర్వాత జోరు పెంచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా వేగంగా ఆడటంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 6 వికెట్లకు 381 పరుగులు చేసింది.

4470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles