సాహా భుజానికి సర్జరీ

Thu,August 2, 2018 02:55 PM

Wriddhiman Saha undergoes surgery for his shoulder

లండన్: టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో తన భుజానికి సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత అతను హాస్పిటల్‌లో ఉన్న ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అతను త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. ఈ ఏడాది మొదట్లో సౌతాఫ్రికా టూర్ నుంచి సాహా గాయంతో బాధపడుతున్నాడు. ఆ టూర్ నుంచి ముందుగానే ఇండియాకు వచ్చేశాడు. తర్వాత ఐపీఎల్ సందర్భంగా అతని బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌కు దూరమయ్యాడు. ఈ మధ్యే అతను భుజం గాయంతో బాధపడుతున్నట్లు తేలింది. భుజానికి సర్జరీ తప్పనిసరి అని తేలడంతో ఇంగ్లండ్ టూర్‌కు సెలక్టర్లు అతన్ని పక్కన పెట్టారు.


నిజానికి ఇది చిన్న గాయమే అని ముందు అనుకున్నా.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిలిటేషన్‌కు వెళ్లినపుడు గాయం తీవ్రత తెలిసింది. సాహా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ లెక్కన ఈ ఏడాది చివర్లో ఉన్న ఆస్ట్రేలియా టూర్‌కు కూడా అతను అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో సాహా స్థానంలో దినేష్ కార్తీక్ టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అతనికి బ్యాకప్‌గా రిషబ్ పంత్‌ను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు.

1279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles