ఇండోపాక్ మ్యాచ్‌పై సానియామీర్జా మాట ఇదీ!

Wed,September 19, 2018 03:32 PM

Would be taking a social media break for some days says Sania Mirza ahead of India Pakistan Match

దుబాయ్: ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండుగే. కొన్ని రోజులు ముందు నుంచే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ హీట్ పెంచుతుంది. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారు.. ఎవరి సత్తా ఎంత అంటూ టీవీ చానెల్స్ చర్చలు మొదలుపెడతాయి. ఇవన్నీ సహజంగా నడిచేవే. అయితే కొన్నేళ్లుగా వీటికి మరొకటి కూడా తోడైంది. ఎప్పుడైతే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను మన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లి చేసుకుందో అప్పటి నుంచీ ఇండోపాక్ మ్యాచ్ జరిగినప్పుడల్లా ఆమె ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు ఇండియాకు సపోర్ట్ చేస్తావా, పాకిస్థాన్‌కు సపోర్ట్ చేస్తావా అని కావాలని రెచ్చగొట్టే ప్రశ్నలు ఆమెను అడుగుతారు. అయితే దీనిపై ఈసారి ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. ఎలాంటి చెత్త కామెంట్స్, తిట్లు వినకుండా, చూడకుండా ఉండేందుకు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు ఆమె ట్విటర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఆమె గర్భవతి అన్న విషయం తెలిసిందే. త్వరలోనే సానియా బిడ్డకు జన్మనివ్వనుంది. అభిమానుల ట్రోల్స్‌ను ఓ సాధారణ వ్యక్తే తట్టుకోలేరు.. ఇక గర్భవతి అయిన తన వల్ల కాదని కూడా సానియా ఆ ట్వీట్‌లో చెప్పడం విశేషం.


2294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles