సాకర్ ట్రోఫీని ఎలా తీసుకొచ్చారో చూడండి..వీడియో

Sun,July 15, 2018 08:56 PM

World Cup Trophy Arrives At Luzhniki Stadium

మాస్కో: అభిమానులను ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అంతిమ సమరానికి సర్వం సిద్ధమైంది. లుజ్నికి స్టేడియంలో మాజీ ఛాంపియన్ ఫ్రాన్స్.. తొలిసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన చిన్న దేశం క్రోయేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. టైటిల్ ఫేవరెట్‌గా బరిలో దిగి అంచనాలకు తగ్గట్లుగా రాణించిన ఫ్రాన్స్.. అగ్రశ్రేణి జట్లను మట్టికరిపించి ఆత్మవిశ్వాసంతో ఉన్న క్రోయేషియా ఫైనల్ పోరులో తమ సత్తా చాటి ట్రోఫీ సొంతం చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నాయి.

జగజ్జేతగా నిలిచి జీవితాంతం గుర్తుండిపోయే అపురూప, అరుదైన అనుభవం తమకే దక్కాలని ఇరుజట్లు కోరుకుంటున్నాయి. మెగా ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుకు అందించే ట్రోఫీని అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తుదిపోరు జరుగుతున్న లుజ్నికి స్టేడియానికి నిర్వాహకులు తీసుకొచ్చారు. ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఫిఫా టోర్నీ నిర్వహణలో ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా అంతా కొత్తగానే ఉంటుంది. ఏ విషయంలోనైనా విశ్వక్రీడగా అవతరించిన ఫిఫా ప్రత్యేకతే వేరు.


3610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles