ఐపీఎల్‌కు కేదార్‌ జాదవ్‌ దూరం..!

Mon,May 6, 2019 01:29 PM

World Cup-bound Kedar Jadhav likely to be ruled out of IPL 2019

మొహాలి: ఐపీఎల్‌-2019 లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు కేదార్‌ జాదవ్‌ గాయపడ్డాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. అతడు సౌకర్యంగా, నొప్పితో ఇబ్బందిపడుతున్నాడని చెన్నై హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వివరించాడు. జాదవ్‌ ప్లేఆఫ్స్‌ ఆడే అవకాశాలు కన్పించట్లేదని మ్యాచ్‌ అనంతరం ఫ్లెమింగ్‌ పేర్కొన్నారు.

ఐతే, జాదవ్‌ భారత ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైనందున ఒకవేళ అతడు కోలుకున్నప్పటికీ అతన్ని చెన్నై తరఫున ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లకు దూరంగా ఉంచాలనుకుంటున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. గాయం తీవ్రత దృష్ట్యా అతనికి విశ్రాంతి కల్పించాలనుకుంటుననారు. ఇవాళ ఎక్స్‌రే, స్కానింగ్‌ తీసిన తర్వాత అతని గాయం తీవ్రతపై పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

2903
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles