ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్ ఇదే..భారత్ నుంచి ఆ ఇద్దరే!

Mon,July 15, 2019 05:15 PM

world cup 2019  Team of the Tournament

లండన్: ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ సమరంలో ఇంగ్లాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రధాన మ్యాచ్‌తో పాటు సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అభిమానులంతా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఐతే మెగా టోర్నీలో అన్ని జట్ల నుంచి కొంతమంది ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శనతో అలరించారు. టోర్నీ ఆసాంతం విశేషంగా రాణించిన ఆటగాళ్లతో ఐసీసీ వరల్డ్‌కప్ టీమ్‌ను ఎంపిక చేసింది. టోర్నమెంట్ టీమ్‌లో టీమిండియా నుంచి హార్డ్‌హిట్టర్ రోహిత్ శర్మ, యువ స్పీడ్‌స్టర్ బుమ్రాకు చోటు దక్కింది. టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి జాబితాలో స్థానం లేకపోవడం గమనార్హం. కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా.. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని వికెట్ కీపర్‌గా సెలక్ట్ చేశారు.

టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్..!

జేసన్ రాయ్(ఇంగ్లాండ్)
రోహిత్ శర్మ(భారత్)
కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)
జో రూట్(ఇంగ్లాండ్)
షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)
బెన్‌స్టోక్స్(ఇంగ్లాండ్)
అలెక్స్ కేరీ(ఆస్ట్రేలియా)
మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)
జోఫ్రా ఆర్చర్(ఇంగ్లాండ్)
ఫర్గుసన్(న్యూజిలాండ్)
జస్ప్రిత్ బుమ్రా(భారత్)
ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్, 12వ ఆటగాడిగా)

8878
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles