వరల్డ్ కప్ ఫైనల్.. మైదానంలోకి దూసుకెళ్లబోయిన స్ట్రీకర్..

Sun,July 14, 2019 08:23 PM

woman streaker tried to enter world cup final match ground

లండన్: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓ స్ట్రీకర్ మైదానంలోకి దూసుకెళ్లే యత్నం చేసింది. స్విమ్ సూట్‌ను పోలిన నల్లని డ్రెస్‌ను ధరించిన ఓ మహిళ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకెళ్లబోయింది. అయితే ఆమెను అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అడ్డుకుని స్టేడియం బయటకు తీసుకెళ్లారు. న్యూజిలాండ్ జట్టు స్కోరు 1 వికెట్ నష్టానికి 45 పరుగుల వద్ద ఉండగా ఆ మహిళ మైదానంలోకి దూసుకెళ్లేందుకు యత్నించింది. ఓ అడల్ట్ వెబ్‌సైట్‌కు చెందిన పదాలను డ్రెస్‌పై రాసుకున్న ఆ మహిళ సదరు వెబ్‌సైట్ ప్రచారం కోసమే ఆ పని చేసిందని తరువాత నిర్దారణకు వచ్చారు.

5438
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles