కోహ్లీ, ధోనీ లేకుండానే బరిలోకి భారత్‌

Sun,November 4, 2018 10:02 AM

With no Virat Kohli and MS Dhoni, India begin T20I challenge after ODI series triumph

కోల్‌క‌తా: భార‌త మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోనీ, రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండానే భారత జట్టు టీ20 సిరీస్‌లో ప్రస్తుత వరల్డ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డేందుకు రెడీ అయింది. విరాట్‌ కోహ్లికి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో రోహిత్‌శర్మ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కార్లోస్ బ్రాత్‌వైట్ సార‌థ్యంలో స్టార్ హిట్ట‌ర్ల‌తో విండీస్ బ‌రిలో దిగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇరుజ‌ట్ల మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు సైతం అస‌లు సిస‌లైన మ‌జా ఆస్వాదించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌లోనే తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ వన్డేల్లో 264 పరుగుల వరల్డ్‌ రికార్డును 2014లో అతడు ఇక్కడే నమోదు చేశాడు. ఈడెన్‌ గార్డెన్స్ వికెట్ ఎక్కువ‌గా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రెండు జ‌ట్ల‌లో బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉండ‌టంతో వ‌న్డే సిరీస్ త‌ర‌హాలోనే ప‌రుగుల వ‌ర్షం కుర‌వ‌నుంది. రాత్రి 7 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభంకానుంది.

జట్లు (అంచనా)

భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రాహుల్, మనీశ్ పాండే, రిషబ్, దినేశ్ కార్తీక్, క్రునాల్ పాండ్యా, కుల్దీప్ / చాహల్, భువనేశ్వర్, బుమ్రా, ఖలీల్.

వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), పావెల్, బ్రావో, హెట్మెయర్, రూథర్‌ఫోర్డ్, పొలార్డ్, రామ్‌దిన్, అలెన్, పియర్రీ, థామస్, మెక్‌కాయ్.

7456
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles