కుంబ్లే లేడు.. జీతాల పెంపూ లేదు!

Thu,June 22, 2017 05:38 PM

With Anil Kumbles exit Virat and Co lost opportunity to get a better Pay

ముంబై: కోచ్ ప‌దవికి అనిల్ కుంబ్లే రాజీనామాతో విరాట్ సేన తీవ్రంగా న‌ష్టపోనుంది. కుంబ్లే వెళ్ల‌డంతో త‌మ‌కు ఫ్రీడ‌మ్ దొరికింద‌ని ప్లేయ‌ర్స్ సంబ‌ర‌ప‌డుతున్నారేమోగానీ.. అత‌ను వెళ్ల‌డం వ‌ల్ల ఇప్పుడు వాళ్ల జీతాల పెంపు స‌మ‌స్య మొద‌టికొచ్చింది. ప్లేయ‌ర్స్‌కు జీతాలు పెంచాల‌ని కుంబ్లేనే డిమాండ్ చేశాడు. అంతేకాదు బోర్డుతో ఢీ అంటే ఢీ అన్నాడ‌త‌డు. బోర్డు ఆదాయంతో పోలిస్తే.. ఆట‌గాళ్లు అందుకుంటుంది చాలా త‌క్కువే అని కుంబ్లే వాదించాడు. ప్లేయ‌ర్స్ త‌ర‌ఫున ముందుండి పోరాడాడు. నేష‌న‌ల్ టీమ్ ప్లేయ‌ర్స్‌, స‌పోర్టింగ్ స్టాఫ్ జీతాలు భారీగా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కుంబ్లే స్ప‌ష్టంచేశాడు. ఈ విష‌యంలో బీసీసీఐలోని కొంద‌రి అధికారులకు కుంబ్లే విల‌న్‌గా క‌నిపించాడు.

అంతేకాదు కోర్టు నియ‌మించిన క‌మిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేట‌ర్స్‌ను జీతాల పెంపున‌కు అంగీక‌రించేలా చేశాడు కుంబ్లే. ఇప్ప‌టికే బోర్డు ఆర్థిక శాఖ ప్లేయ‌ర్స్‌కు ఎంత వ‌స్తుంది? కుంబ్లే డిమాండ్ చేసింది ఎంత అన్న లెక్క‌లు కూడా వేస్తున్న‌ది. అయితే ఇప్పుడు స‌డెన్‌గా అత‌ను త‌ప్పుకోవ‌డంతో ప్లేయ‌ర్స్ జీతాల పెంపు స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికొచ్చే అవ‌కాశం ఉంది. కొత్త కోచ్ ప్లేయ‌ర్స్ జీతాల కోసం ఇంత రిస్క్ తీసుకుంటాడా అన్న‌ది అనుమాన‌మే. అంతేకాదు ఆట‌గాడిగా, అడ్మినిస్ట్రేట‌ర్‌గా మంచి అనుభ‌వం ఉన్న కుంబ్లేలాంటి వ్య‌క్తి అయితేనే ఇలాంటి స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌గ‌ల‌డు. ఇప్పుడ‌తనే లేక‌పోవ‌డంతో విరాట్ సేన తీవ్రంగా న‌ష్ట‌పోవ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న‌ది.

1854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles