ఫెద‌ర‌ర్.. నాతో డ్యాన్స్ చేస్తావా?Mon,July 17, 2017 03:05 PM

Wimbledon Ladies Champion Muguruja asked Federer to dance with her

లండ‌న్‌: వింబుల్డ‌న్‌ను ఎనిమిదోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్విస్ మాస్ట‌ర్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌.. మాంచి ఊపు మీదున్నాడు. వింబుల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ముగిసిన త‌ర్వాత చాంపియ‌న్స్ డిన్న‌ర్ ఏర్పాటు చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ఈ సందర్భంగా మెన్స్ చాంపియ‌న్ రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, వుమెన్స్ చాంపియ‌న్ ముగురుజ ఈ డిన్న‌ర్‌కు వ‌చ్చారు. అంత‌కుముందే ముగురుజ.. స్విస్ మాస్ట‌ర్‌కు ఓ చాలెంజ్ విసిరింది. నిజానికి శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్లో తొలిసారి వింబుల్డ‌న్ గెలిచిన ముగురుజ‌ను అప్పుడే మీడియా ఓ ప్ర‌శ్న అడిగింది. చాంపియ‌న్స్ డిన్న‌ర్‌లో ఎవ‌రితో డ్యాన్స్ చేయాల‌నుకుంటున్నావ్ అని అడిగితే.. ఫెద‌ర‌ర్ అని ఏ మాత్రం ఆలోచించ‌కుండా చెప్పింది. ఆమె కోరుకున్న‌ట్లే ఫెడెక్స్ గెల‌వ‌డంతో.. ఇక ట్విట్ట‌ర్‌లో నాతో డ్యాన్స్ చేస్తావా అని ముగురుజ అడిగింది.


దీనికి ఫెద‌ర‌ర్ కూడా చాంపియ‌న్ స్టైల్లో స్పందించాడు. రెడీగా ఉన్నా చాంప్‌.. తీసుకెళ్లంటూ ఫెడెక్స్ కూడా ట్వీట్ చేశాడు. దీంతోపాటు డిన్న‌ర్‌కు వెళ్లే ముందు తాను సూట్‌లో ఉన్న ఫొటోను కూడా ఫెడెక్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు.


కెరీర్‌లో 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఫెడెక్స్ ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. తాజాగా 8వ వింబుల్డ‌న్ టైటిల్‌తో సంప్రాస్ పేరిట ఏడు వింబుల్డ‌న్ టైటిల్స్‌తో ఉన్న రికార్డును కూడా అత‌ను అధిగ‌మించాడు. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఈసారి వింబుల్డ‌న్ టైటిల్ గెలిచి.. గ్రాస్‌కోర్ట్‌లో త‌న‌కు తిరుగులేద‌ని స్విస్ మాస్ట‌ర్ మ‌రోసారి నిరూపించాడు.

2200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS