రైజర్స్ హ్యాట్రిక్

Sun,April 15, 2018 01:02 AM

Williamson Shine as Hyderabad Beat Kolkata by 5 Wickets

కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. 46 పరుగులకే ఓపెనర్లు ధవన్(7), సాహా(24) వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ను కెప్టెన్ విలియమ్సన్(44 బంతుల్లో 50, 4 ఫోర్లు, సిక్స్) జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. నాలుగు పరుగుల తేడాతో షకీబల్, విలియమ్సన్ ఔటైనా దీపక్‌హుడా(5 నాటౌట్), యూసుఫ్ పఠాన్(17 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. సునీల్ నరైన్(2/17)కు రెండు వికెట్లు దక్కగా, పీయూష్ చావ్లా(1/20), కుల్దీప్‌యాదవ్(1/23) ఒక్కో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యఛేదన వైపు మొగ్గుచూపింది. భువీ(3/26), స్టాన్‌లేక్(2/21), షకీబల్‌హసన్(2/21) ధాటికి కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగడంతో కోల్‌కతాకు మెరుగైన శుభారంభం దక్కలేదు. 16 పరుగులకే ఓపెనర్ రాబిన్ ఊతప్ప(3) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన నితీశ్ రానా(18), క్రిస్‌లిన్(49)కు జతకలిశాడు. వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో వేసేందుకు ప్రయత్నించారు. అయితే స్టాన్‌లేక్ బౌలింగ్‌లో మనీశ్ పాండే సూపర్ క్యాచ్‌తో రానా నిష్క్రమించాడు. ఇక్కణ్నుంచి కోల్‌కతా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మధ్యలో వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ కొద్దిసేపు ఆగిపోయింది. విరామం తర్వాత ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 59 పరుగుల తేడాతో కోల్‌కతా ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కార్తీక్(29) ఫర్వాలేదనిపించినా..నరైన్(9), రస్సెల్(9), గిల్(3) విఫలమయ్యారు.

సంక్షిప్త స్కోర్లు: కోల్‌కతా: 20 ఓవర్లలో 138/8(లిన్ 49, కార్తీక్ 29, భువనేశ్వర్ 3/26, స్టాన్‌లేక్ 2/21), హైదరాబాద్: 19 ఓవర్లలో 139/5(విలియమ్సన్ 50, షకీబల్ 27, పఠాన్ 17 నాటౌట్, నరైన్ 2/13).

2264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles