కివీస్ కెప్టెన్ ఒంట‌రి పోరాటం

Wed,January 23, 2019 09:45 AM

Williamson has played a captains knock

నేపియర్:భారత్‌తో తొలి వన్డేలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమన్స్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. భారత బౌలర్ల దెబ్బకు తక్కువ స్కోరుకే కీలక వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. దీంతో కేన్ ఆచితూచి ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు. ఫ్లాట్ ట్రాక్‌పై టీమిండియా పేసర్లు, స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ మొదట్లోనే బౌలర్లు భారీ దెబ్బకొట్టారు. ఐతే సూపర్ ఫామ్‌లో ఉన్న విలియమ్సన్ నిదానంగా ఆడుతూ జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించే దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 26వ ఓవర్లో అర్ధశతకం పూర్తి చేశాడు. కెరీర్ అతనికిది 36వ హాఫ్‌సెంచరీ కావడం విశేషం. కేన్‌కు సహకారం అందిస్తున్న సాంట్నెర్‌ను పెవిలియన్ పంపి మ్యాచ్‌పై పట్టు సాధించారు. 30వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన షమీ.. సాంట్నెర్(14)ను ఎల్బీడబ్లూగా ఔట్ చేశాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ఆడిన కివీస్ 6 వికెట్లకు 133 పరుగులు చేసింది. కేన్ (58), బ్రాస్‌వెల్(0) క్రీజులో ఉన్నారు.

2811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles