పాక్‌తో మ్యాచ్ మధ్యలో కోహ్లీ కామెడీ ఇన్నింగ్స్: వీడియో

Mon,June 17, 2019 02:18 PM

Who is Virat Kohli trying to mimic

మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. హైఓల్టేజ్ మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో భారత్ అజేయ రికార్డును నిలబెట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో తలపడిన ఏడుసార్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో అందరు ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉంటారని అందరూ అనుకున్నారు. ఐతే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం మ్యాచ్ ఆసాంతం నవ్వుతూ కనిపించాడు. బ్యాటింగ్ చేసినప్పుడు కానీ, ఫీల్డింగ్ సమయంలోనూ చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా కనిపించాడు. రోహిత్ శర్మ శతకంతో చెలరేగడంతో పాక్ ఢీలాపడిపోయింది. ఆ టీమ్ ఏ దశలోనూ జోష్‌లో కన్పించలేదు. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సహచర ఆటగాళ్లతో కలిసి కోహ్లీ సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఎవరినో ఇమిటేట్ చేశాడు. కోహ్లీ హావభావాలను చూసిన కుల్దీప్ పడిపడి నవ్వాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫైనల్‌కు ముందు ఫైనల్ లాంటి మ్యాచ్‌లో విరాట్ ఎలాంటి ఆందోళన లేకుండా, మ్యాచ్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో కన్పించడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.5961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles