ఎవరీ మీరాబాయ్ చాను?

Thu,April 5, 2018 05:42 PM

Who is Mirabai Chanu who won Indias first Gold Medal in Commonwealth Games

ఇంఫాల్: కామెన్వెల్త్ గేమ్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టింది వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్ చాను. ఈమె సొంత రాష్ట్రం మణిపూర్. గోల్డ్ మెడల్ గెలిచే క్రమంలో ఈమె మూడు కామన్వెల్త్ గేమ్స్‌ రికార్డులను బద్ధలు కొట్టింది. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, ఓవరాల్‌గా మూడు రికార్డులనూ చాను తన పేరిట రాసుకుంది. చాను 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల కేటగిరీలోనే తన తొలి మెడల్ (సిల్వర్) గెలిచింది. ఆ తర్వాత వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా చాను నిలిచింది. ఈ విజయం తర్వాత మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఆమెకు రూ.20 లక్షల చెక్ ఇచ్చి సత్కరించారు. ఈ ఏడాది చానుకు పద్మశ్రీ అవార్డు కూడా దక్కింది.


2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం చాను విఫలమైంది. ఈ వైఫల్యంతో తాను చాలా కుంగిపోయానని, మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని మీరాబాయ్ చాను చెప్పింది. అసలు మొత్తానికి స్పోర్ట్‌నే వదిలేద్దామని అనుకున్నట్లు తెలిపింది. తనను, తన కోచ్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ తనను తీవ్రంగా బాధించాయని చాను చెప్పింది. కానీ ఆ కుంగుబాటు నుంచి మళ్లీ కోలుకున్న చాను.. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి గోల్డ్ మెడల్ అందించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చింది. ఇక తన తర్వాతి లక్ష్యం 2020 ఒలింపిక్స్ అని ఆమె స్పష్టంచేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో చాను కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాలు చేసుకుంటున్నారు.

3198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles