ఇండియాపై గెలిచిన‌వాళ్ల‌దే ట్రోఫీ..

Fri,July 12, 2019 10:48 AM

Who ever beats India will win the worldcup

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇండియానే ఫెవ‌రేట్ అనుకున్నారు. బెట్టింగ్ సైట్ల‌న్నీ కూడా ఆ మాట‌కే క‌ట్టుబ‌డి ఉన్నాయి. కానీ కోహ్లీసేన మాత్రం ఫైన‌ల్ చేరుకోలేదు. సెమీస్‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. అయితే ఇంగ్లండ్ మాజీ ప్లేయ‌ర్ మైఖేల్ వాన్ ముందు నుంచి ఒకేమాట చెప్పుకొచ్చాడు. ఇండియాపై నెగ్గిన జ‌ట్టుకే వ‌ర‌ల్డ్‌క‌ప్ ద‌క్కుతుంద‌న్నాడు. కామెంటేట‌ర్‌గా మారిన మైఖేల్ వాన్ అన్న మాట‌లు ఇప్పుడు నిజం అయ్యాయి. రౌండ్ రాబిన్ లీగ్‌లో ఇండియాను ఓడించింది ఇంగ్లండ్ మాత్ర‌మే. గ్రూప్ స్టేజ్‌లో మ‌నం టాప్‌లో ఉన్నా.. సెమీస్‌లో మ‌నోళ్లు చేతులెత్తేశారు. అయితే సెమీస్‌లో మ‌న‌పై నెగ్గింది మాత్రం న్యూజిలాండ్‌. ఇప్పుడు గ‌మ్మ‌త్తు ఏంటంటే.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు .. మెగా టోర్నీలో ఇండియాను ఓడించాయి. ఇక ఈ జ‌ట్లే ఆదివారం లార్డ్స్‌లో ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇండియాపై గెలిచిన జ‌ట్టునే వ‌ర‌ల్డ్‌క‌ప్ వ‌రిస్తుంద‌న్న అంచ‌నా నిజం కాబోతున్న‌ది. కానీ కివీస్‌, ఇంగ్లండ్ జ‌ట్లలో ఏది ట్రోఫీని ముద్దాడినా.. అది వాళ్ల‌కు మొద‌టిసారే అవుతుంది.

3388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles