విండీస్ 33/1

Sat,October 6, 2018 12:03 PM

West Indies following on, lost first wicket at Rajkot test

రాజ్‌కోట్: భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్.. తన రెండవ ఇన్నింగ్స్‌లో ఇవాళ భోజన విరామ సమాయానికి వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాత్‌వెయిట్.. అశ్విన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటైయ్యాడు. వెస్టిండీస్ ఇవాళ తన తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. ఇంకా 435 పరుగులు వెనకబడి ఉన్న వెస్టిండీస్.. ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇవాళ మూడు వికెట్లు తీసుకున్న అశ్విన్.. రెండవ ఇన్నింగ్స్‌లోనూ మొదటి వికెట్‌ను తీసుకున్నాడు. కీరన్ పావల్ 22 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నాడు.

2050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles