కుప్పకూలిన విండీస్.. టీమిండియా టార్గెట్ 105

Thu,November 1, 2018 03:53 PM

West Indies dismissed for paltry 104 runs against India in final ODI

తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్ కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లంతా కలిసికట్టుగా రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలోనే చాప చుట్టేసింది. కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కెప్టెన్ జేసన్ హోల్డర్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శామ్యూల్స్ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో జడేజా 4, బుమ్రా, ఖలీల్ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్, కుల్‌దీప్ చెరొక వికెట్ తీశారు. ఇన్నింగ్స్ నాలుగో బంతికే ఓపెనర్ పావెల్ డకౌట్‌గా వెనుదిరగగా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉంది. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన షాయ్ హోప్ (0), హెట్‌మయర్ (9) దారుణంగా విఫలమవడంతో మిగతా బ్యాట్స్‌మెన్ కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. రికార్డు స్థాయిలో విండీస్‌పై వరుసగా ఎనిమిదో వన్డే సిరీస్, సొంతగడ్డపై వరుసగా ఆరో వన్డే సిరీస్‌పై కన్నేసిన కోహ్లి సేన.. ఇప్పటికే సగం పని పూర్తి చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-1 లీడ్‌లో ఉండగా.. ఈ మ్యాచ్ గెలిస్తే 3-1తో సిరీస్ సొంతమవుతుంది.


2778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles