జాతీయ షూటింగ్ టీం రైఫిళ్లు సీజ్.. తిరిగి అప్పగింత

Tue,May 9, 2017 06:52 PM

Weapons of National Shooting Team seized by customs at Delhi airport

ఢిల్లీ: జాతీయ షూటింగ్ బృందం రైఫిళ్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. షూటింగ్ బృందంలోని 13 మంది సభ్యుల రైఫిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు, విచారణ అనంతరం అధికారులు ఆయుధాలను తిరిగి వారికి అందించారు. అంతవరకు ఆటగాళ్లు విమానాశ్రయంలో పడిగాపులు కాశారు. కాగా అధికారుల తనిఖీలపై ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత అభినవ్ బింద్రా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఆటగాళ్ల పట్ల అధికారుల తీరు విచారకరం. ఇదే విధమైన ప్రవర్తనను భారత క్రికెట్ టీం విషయంలో చూపించగలరా అని ప్రశ్నించారు.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles