మేం భ‌య‌ప‌డ్డాం: మిథాలీ

Mon,July 24, 2017 12:25 PM

We Panicked says Mithali Raj after losing to England in Womens World Cup Final

లండ‌న్‌: త‌మ క‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి చాలా ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన మ‌హిళ‌ల టీమ్‌.. చివ‌ర్లో ఒత్తిడికి త‌లొగ్గి ట్రోఫీని దూరం చేసుకుంది. 28 ప‌రుగుల తేడాలో చివ‌రి 7 వికెట్ల‌ను కోల్పోయి.. చేతిలోకి వ‌చ్చింద‌నుకున్న ట్రోఫీని ఇంగ్లండ్ చేతిలో పెట్టేశారు. అయినా త‌మ టీమ్‌ను చూసి ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని అంటున్న‌ది కెప్టెన్ మిథాలీ రాజ్‌. ఇంగ్లండ్ కూడా అంత తేలిగ్గా గెల‌వ‌లేదు. అయితే వాళ్లు ఒత్తిడిని జ‌యించారు. మ్యాచ్ ఒక ద‌శ‌లో రెండు టీమ్స్‌కు స‌మ అవ‌కాశాలు క‌ల్పించింది. కానీ మేం భ‌య‌ప‌డ్డాం. అదే మా ఓట‌మికి దారి తీసింది అని మిథాలీ చెప్పింది. మా జ‌ట్టు స‌భ్యుల‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది. ప్ర‌త్య‌ర్థుల‌కు ఒక్క మ్యాచ్ కూడా సునాయాసంగా ఇవ్వ‌లేదు. ఈ టోర్నీలో బాగా ఆడాము. టీమ్‌లోని యంగ్‌స్ట‌ర్స్ అద్భుతంగా రాణించారు అని మిథాలీ చెప్పింది. ఇక త‌న భ‌విష్య‌త్తుపై స్పందిస్తూ.. మ‌రో రెండేళ్లు టీమ్‌లోనే ఉంటాన‌ని, అయితే వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్ మాత్రం ఆడ‌న‌ని ఆమె స్ప‌ష్టంచేసింది. అయితే త‌మ ప్ర‌ద‌ర్శ‌న చూసి ఇక నుంచి ఇండియాలో మ‌హిళ‌ల క్రికెట్‌ను చూసే విధానం మారుతుంద‌ని మాత్రం మిథాలీ కాన్ఫిడెంట్‌గా చెప్పింది.

3905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles