తుదిజట్టు ఎంపికే పెద్ద పొరపాటు: విరాట్ కోహ్లీ

Mon,August 13, 2018 10:39 AM

 We deserved to lose  Virat Kohli after Lords Test thrashing

లండన్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి తాము అన్నివిధాలా అర్హులమే అని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ ముగిసిన తరువాత మీడియా సమావేశంలో విరాట్ మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను భారత్ తుది జట్టుకు ఎంపిక చేయడంలోనే తప్పు జరిగింది. దీంతోనే జోరూట్ సేన తమపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించిందని పేర్కొన్నాడు.

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జట్టు ఎంపికలో తప్పుజరిగిందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మేము ఆడిన తీరు తీవ్ర నిరాశజనకంగా ఉంది. చివరి ఐదు టెస్టుల్లో తొలిసారి మేం గొప్పగా ఆడటంలో తేలిపోయాం. ఈ మ్యాచ్‌లో ఓటమికి మేం అర్హులమే. మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాతావరణ పరిస్థితుల గురించి ఆలోచించకూడదు. ఇంగ్లాండ్ బౌలర్లు సంచలన బౌలింగ్‌తో మాపై ఎదురుదాడికి దిగారు. మా జట్టు కూర్పులోనే పెద్ద పొరపాటు జరిగింది. అదనపు సీమర్ లేకపోవడంతోనే ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యాం. వెన్ను నొప్పితో కొంచెం ఇబ్బందిపడ్డా. మూడో టెస్టుకు మధ్య ఉన్న విరామంతో కోలుకుంటానని ఆశిస్తున్నా. అని విరాట్ వివరించాడు.

3652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles