'ఐపీఎల్‌'ను వీడుతున్నారు..'గ్లోబ‌ల్' స్టార్స్‌..!

Fri,April 26, 2019 04:47 PM

WC-bound stars departure takes away sheen of IPL

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12 సీజన్‌ లీగ్‌ దశ ముగింపునకు చేరుకుంది. నాలుగు ప్లే ఆఫ్‌ బెర్తుల కోసం 8 జట్లు పోటీ పడుతున్నాయి. అన్ని జట్లూ ఇప్పటికే కనీసం 10 మ్యాచ్‌లు ఆడాయి. ఈ దశలో చెన్నై మినహా మిగతా అన్ని జట్లకు ప్రతీ మ్యాచ్‌ కీలకమే. ఇప్పటికే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాకౌట్‌ పోరుకు అర్హత సాధించింది. ప్లేఆఫ్‌లో చోటు కోసం పోరాడుతున్న సమయంలో విదేశీ స్టార్‌ ప్లేయర్స్‌ ఐపీఎల్‌ను వీడుతున్నారు. దీంతో ఆయా జట్ల గెలుపోటములపై వీరులేని లోటు తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అంతర్జాతీయ స్టార్‌వార్స్‌ లేకపోతే టోర్నీ కళ తప్పేలా కన్పిస్తోంది. ఐసీసీ వరల్డ్‌ కప్‌ మే 30 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా ఆరంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా దేశాల ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మోగా టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు స్వదేశానికి వెళ్తున్నారు.

ఏఏ జట్టు నుంచి ఎంత మంది కీలక ఆటగాళ్లు దూరమవుతున్నారో ఓసారి పరిశీలిద్దాం..!ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌ ప్లేయర్స్‌ ఈ వీకెండ్‌ ముగిసేలోగా ఐపీఎల్‌ను వీడనున్నారు. ఐతే, అఫ్గనిస్థాన్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌కు చెందిన క్రికెటర్లు మాత్రం టోర్నీ పూర్తయ్యే వరకు ఫ్రాంఛైజీలకు అందుబాటులో ఉండనున్నారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో సీజన్‌లో చెన్నైతో ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌(574 పరుగులు) దక్కించుకున్న హార్డ్‌హిట్టర్‌, ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ జట్టు నుంచి త్వరలో ఆస్ట్రేలియా బయలుదేరనున్నాడు.

ఐపీఎల్‌ను వీడే స్టార్‌ ప్లేయర్స్‌ వీళ్లే..!సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, షకీబ్‌ అల్‌ హసన్‌(బంగ్లాదేశ్‌)

చెన్నై సూపర్‌ కింగ్స్‌: డుప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: మొయిన్ అలీ, డేల్‌ స్టెయిన్‌, మార్కస్‌ స్టోయినీస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌

రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, స్టీవ్‌ స్మిత్‌, జోఫ్రా ఆర్చర్‌

ముంబయి ఇండియన్స్‌: క్వింటన్‌ డికాక్‌, బెహ్న్రెండార్ఫ్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: డేవిడ్‌ మిల్లర్‌,

ఢిల్లీ క్యాపిటల్స్‌: కగిసో రబాడ

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: జో డెన్లీ,

5888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles