ఆ జెర్సీ నంబర్ అసలు రహస్యం ఇదే

Mon,April 16, 2018 07:25 PM

Washington Sundar decodes secret behind jersey number 555

న్యూఢిల్లీ: యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ 2017లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా వెలుగులోకి వచ్చాడు. గత సీజన్‌లో గాయం కారణంగా ఆజట్టు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరమవడంతో అతని స్థానంలో అప్పటి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ సుందర్‌ను తీసుకుంది. అతని పేరు విచిత్రంగా ఉండటంతో గతేడాదే అతడిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. తనకు ఆపేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని అతడే గతంలోనే వివరించాడు. తాజాగా ఐపీఎల్‌లో అతడు ధరిస్తున్న జెర్సీ నంబర్‌పై చర్చ జరుగుతుండటంతో కొందరు అడిగిన ప్రశ్నకు తాజాగాబదులిచ్చాడు.

నేను 1999 అక్టోబర్ 5న ఉదయం 5:05 గంటలకు జన్మించాను. కావున నా కిట్‌పై 555 నంబర్ వేసుకోవాలని నిర్ణయించాను అని సుందర్ తెలిపాడు. గతేడాది మెరుగైన స్థాయిలో రాణించడంతో ఈ ఏడాది వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.3.2కోట్లు పెట్టి అతన్ని కొనుగోలు చేసింది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 19 బంతుల్లో 1ఫోరు, 3సిక్సర్లతో విజృంభించి 35 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో మాత్రం సీజన్‌లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

2763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS