తొలి వికెట్ కోల్పోయిన భారత్

Sun,June 16, 2019 04:45 PM

Wahab removes Rahul after solid opening stand

మాంచెస్టర్: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వాహబ్ రియాజ్ వేసిన 24వ ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ కేఎల్ రాహుల్.. బాబర్ అజామ్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 136 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 78 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 57 రన్స్ చేశాడు. ధావన్ స్థానంలో ఓపెనర్‌గా బరిలో దిగి ఆరంభంలో తడబడ్డ రాహుల్..నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం, బంతులు ఎదుర్కొన్నాడు. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(81), విరాట్ కోహ్లీ(1) క్రీజులో ఉన్నారు.2749
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles