ఆ క్రికెటర్‌తో భారత్‌కు ప్రమాదమే: వీవీఎస్ లక్ష్మణ్

Fri,September 14, 2018 03:20 PM

VVS Laxman names Shoaib Malik as real threat for India vs Pakistan

ముంబయి: ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌తో భారత జట్టుకు ప్రమాదమేనని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించాడు. అతడు క్రీజులో పాతుకుపోతే పాకిస్థాన్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దుబాయ్ పిచ్‌లు అతడి బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఉంటాయని.. మంచి ఆరంభం లభిస్తే కట్టడి చేయడం అసాధ్యం అని ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌పై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. మిడిల్ ఓవర్లలో భారత్ స్పిన్నర్లతో బౌలింగ్ చేస్తుంది. స్పిన్ బౌలింగ్‌లో ఆడటంలో అతడు గొప్ప ఆటగాడు. ప్రస్తుతం భారత జట్టులో ఇద్దరు నాణ్యమైన మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఓపెనర్‌గా ఫకార్ జమాన్, మూడో స్థానంలో బరిలో దిగే బాబర్ అజామ్‌పైనే పాక్ ఎక్కువగా ఆధారపడుతోంది. షోయబ్ మాలిక్ పాక్ బ్యాటింగ్ లైనప్‌లో ప్రధాన ఆయుధం. ైస్ట్రెక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీయడమే కాకుండా.. అలవోకగా బంతులను బౌండరీలను తరలిస్తాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అపారమైన అనుభవం ఉందని, అతనొక ఛాంపియన్ అని వీవీఎస్ కితాబిచ్చాడు. టోర్నీలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 19న పాక్‌తో మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.

5225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS