ఆమె నుంచి సాకర్ జెర్సీ అందుకున్న పుతిన్

Sun,July 15, 2018 08:10 PM

మాస్కో: భారీ అంచనాల నడుమ మొదలై అనూహ్య రీతిలో మలుపులు తిరుగుతూ సాగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. అప్రతిహత విజయాలతో క్రోయేషియా తొలిసారిగా ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ చేరింది. 1950లో ఉరుగ్వే(జ‌నాభా 24లక్షలు) తరువాత ఫైనల్ పోరుకు అర్హత సాధించిన చిన్న దేశంగా ఫిఫా చరిత్రలోనే క్రోయేషియా(41.7లక్షలు) మరో రికార్డు నెలకొల్పింది. బలాబలాలు, చరిత్ర చూస్తే ఫైనల్లో ఫ్రాన్స్ ఫేవరెట్. మామాలుగానే ఫ్రాన్స్ పెద్ద జట్టు. పసికూన క్రోయేషియా.. మెగా టోర్నీలో అసాధారణ అనుభవం కలిగిన ఫ్రాన్స్ మధ్య పోరు ఎలా సాగుతుందనేది అసక్తికరంగా మారింది.


మెగా ఫైనల్‌ను వీక్షించేందుకు క్రోయేషియా అధ్యక్షురాలు కొలిందా రష్యాలోనే ఉన్నారు. నేను ఫైనల్ మ్యాచ్‌కు కేవలం అధ్యక్షురాలిగానే కాకుండా ఒక నిజమైన ఫుట్‌బాల్ అభిమానిగా హాజరుకాబోతున్నా అని ఫైనల్ మ్యాచ్‌కు ముందు రోజు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు మా జట్టు జెర్సీ ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఆతిథ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కూడా ఆమె తమదేశ ఫుట్‌బాల్ టీమ్ జెర్సీ బహూకరించారు. ఆ టీషర్ట్ వెనుక పుతిన్ అని రాసి ఉంది. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ జట్టుకు మద్దతు తెలపాలని కోరారు.

1995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles