స్వచ్ఛమైన ప్రేమ.. కోహ్లి, అనుష్క లేటెస్ట్ యాడ్ చూశారా.. వీడియో

Thu,March 21, 2019 12:37 PM

Virushkas latest ad talks about Pure Love

ముంబై: ఇద్దరూ సెలబ్రిటీలే. పెళ్లి చేసుకున్నా.. కలిసి ఉండటానికి క్షణం తీరిక ఉండని షెడ్యూల్ వాళ్లది. దీంతో ఇద్దరూ కలిసి యాడ్స్‌లో నటిస్తూ ఆ విరహ వేదన లేకుండా చేసుకుంటున్నారు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ. ఇప్పటికే ఎన్నో యాడ్స్‌లో కలిసి నటించిన ఈ జంట.. తాజాగా ప్యూర్ లవ్ అంటూ ఓ స్టీల్ కంపెనీ యాడ్‌లో కనిపించారు. ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేసిన కోహ్లి.. ఈ యాడ్ షూటింగ్ చాలా ఆనందాన్నిచ్చిందని అన్నాడు. ఇదే స్టీల్ కంపెనీ కోసం గత డిసెంబర్‌లోనూ ఈ ఇద్దరూ కలిసి నటించారు. అందులో క్రికెట్ ఫీల్డ్‌లో తొలిసారి అడుగుపెట్టినపుడు కోహ్లి, కెమెరా ముందు తొలిసారి నటించినప్పుడు అనుష్క శర్మ తమకు కలిగిన అనుభవాలను పంచుకున్నారు. 2017, డిసెంబర్‌లో ఈ క్రికెట్, బాలీవుడ్ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

1648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles