నేను చెస్‌లో కింగ్ లాంటోన్ని!

Tue,June 6, 2017 01:07 PM

Virender Sehwag trolls wife in Twitter with a Hilarious tweet

బ‌ర్మింగ్‌హామ్‌: ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌. ఫ‌న్నీ ట్వీట్లు, పంచ్‌ల‌తో అద‌రగొట్టే వీరూ.. ఈసారి త‌న భార్య‌పై ఓ ట్వీటేశాడు. నా భార్య నాకు కింగ్ అనే పేరు పెట్టింది. అయితే అది చెస్‌లో కింగ్‌. అందులో రాజు ఒక‌సారి ఒక్క అడుగు మాత్ర‌మే వేయ‌గ‌ల‌డు. కానీ క్వీన్ మాత్రం ఎటు కావాలంటే అటు వెళ్ల‌గల‌దు.. ఏమైనా చేయ‌గ‌ల‌దు అంటూ వీరూ సూప‌ర్ ట్వీట్ చేశాడు.


భార్య ఆర్తిని ట్రోల్ చేయ‌డం వీరూకిదే తొలిసారి కాదు. గ‌తంలోనూ ఇలాంటిదే ఓ ట్వీట్ చేశాడు. భార్య‌తో నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఎలా ఉంటామో అలాగే ఉండాలి. ఆమె ఏం మాట్లాడితే అది వినాలి. అవ‌స‌రం ఉన్న‌పుడు ప‌రుగెత్తాలి అని సెహ్వాగ్ అప్ప‌ట్లో వేసిన ట్వీట్‌ను నెటిజ‌న్లు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు.

1247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS