కింగ్స్ పంజాబ్ ఓపెనర్‌గా సెహ్వాగ్!

Sun,April 1, 2018 01:54 PM

Virender Sehwag to open the innings for Kings Punjab team in IPL Opener

మొహాలీః ఇవాళ ఏప్రిల్ ఒకటి. ఫూల్స్‌ను చేయడానికి చాలా మంది చాలా గాలి వార్తలు చెబుతుంటారు. ఇవాళ ఉదయమే ఐపీఎల్ టీమ్ కింగ్స్ పంజాబ్ కూడా ఇలాగే తొలి మ్యాచ్‌లో టీమ్ తరఫున క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనింగ్ చేస్తాడు అంటూ ఓ ట్వీట్ చేసింది. దీనిని నిజానికి చాలా మంది ఏప్రిల్ ఫూల్ చేసే వార్తగానే భావించారు. అయితే కాసేపటికే ఆ టీమ్ ప్లేయర్ యువరాజ్ సింగ్ కూడా మరో ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను మళ్లీ ఆడితే చూడాలని ఉంది అంటూ యువీ చేసిన ట్వీట్ మరిన్ని సందేహాలకు తావిచ్చింది. వీరూ నిజంగానే రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి పంజాబ్ టీమ్ తరఫున ఆడతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


పంజాబ్ టీమ్ తరఫున ఓపెనర్‌గా ఉన్న ఆరోన్ ఫించ్.. పెళ్లి చేసుకుంటుండటంతో ఢిల్లీతో జరిగే తొలి మ్యాచ్‌కు రాలేకపోతున్నాడు. దీంతో అతని స్థానంలో ఎవరిని ఆడించాలా అని కొన్ని రోజులుగా కింగ్స్ పంజాబ్ టీమ్ తెగ ఆలోచిస్తున్నది. చివరికి వీరూనే బెటరని టీమ్ భావించింది. కెప్టెన్ అశ్విన్, కోచ్ బ్రాడ్ హాడ్జ్, సెహ్వాగ్‌లతోపాటు టీమ్ మేనేజ్‌మెంట్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యే ఐస్ క్రికెట్‌లో చాలా రోజుల తర్వాత ఆడిన వీరూ.. మంచి ఫామ్ కనబరిచాడు. ఇప్పుడు నెట్స్‌లోనూ తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మొదట్లో బౌలర్లకు కాస్త ప్రాక్టీస్ ఇవ్వడానికి నెట్స్‌లోకి దిగినా.. ఇప్పుడు తాను చాలా బాగా ఆడుతున్నట్లు వీరూ చెప్పాడు. కోచ్ హాడ్జ్ సరదాగా తన పేరు చెప్పినా.. ఇప్పుడు నేను కూడా ఓపెనర్‌గా వెళ్లడానికి సీరియస్‌గా ఆలోచిస్తున్నా అని అతను అన్నాడు. ఫించ్ ఈ నెల 7న పెళ్లి చేసుకుంటున్నాడు. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌ను 8న ఆడనుంది. దీంతో అతను ఈ మ్యాచ్ సమయానికి రావడం అసాధ్యం. అటు ఢిల్లీ టీమ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ కూడా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

6824
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles