మ‌తం మీ అబ్బ సొత్తా.. పాక్ ఫ్యాన్‌కు కైఫ్ స్ట్రాంగ్ రిప్లై!Fri,May 19, 2017 03:02 PM

Virender Sehwag, Mohammad Kaif Befitting Reply to Pakistani Trolls

న్యూఢిల్లీ: కుల్‌భూష‌ణ్ కేసులో అంత‌ర్జాతీయ కోర్టు భార‌త్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వ‌డానికి పాకిస్థాన్ జీర్ణించుకోలేక‌పోతున్న‌ది. ఈ వార్త రాగానే మ‌న దేశంలోని సాధార‌ణ జ‌నంతోపాటు రాజ‌కీయ నేత‌లు, సెల‌బ్రిటీలు కూడా ఆనందం వ్య‌క్తంచేశారు. క్రికెట‌ర్లు సెహ్వాగ్‌, మ‌హ్మ‌ద్ కైఫ్‌లు కూడా త‌మ సంతోషాన్ని వ్య‌క్తంచేస్తూ ట్వీట్లు చేశారు. అయితే వీటిపై పాక్ అభిమానులు ప్ర‌తికూలంగా స్పందించారు. కోర్టు ఏం చెప్పినా అత‌న్ని తాము ఉరితీస్తామ‌ని ఒక‌రంటే.. నీ పేరులో నుంచి మ‌హ్మ‌ద్ అనే పేరు తీసెయ్ అని కైఫ్‌కు మ‌రొక‌రు ట్వీట్స్ చేశారు. అయితే వీటికి మ‌న‌వాళ్లు కూడా దిమ్మ దిరిగేలా రిప్లై ఇచ్చారు.


వీరూ త‌నదైన స్టైల్లో స్పందించాడు. వ‌రల్డ్‌క‌ప్‌లో ఇండియాపై గెలిచిన‌ట్లు క‌ల‌లు కంటున్న‌ట్లు ఈ కేసు విష‌యంలోనూ క‌లలు క‌నండి అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. కుక్క‌ల్ని పెంచుకోండి.. పిల్లుల్ని పెంచుకోండి.. కానీ ఇలా త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌ను పెంచుకోకండి అంటూ ఘాటుగా స్పందించాడు వీరూ.
అటు కైఫ్ అయితే సున్నితంగా స్పందిస్తూనే ఆ వ్య‌క్తికి చుర‌క‌లంటించాడు. మతం, పేరు ఎవ‌రి సొత్తూ కాద‌ని, భార‌త్ వంటి స‌హ‌న‌శీల దేశం ప్ర‌పంచంలో మ‌రొక‌టి లేద‌ని కైఫ్ ట్వీట్ చేశాడు.
మొత్తానికి గ్రౌండ్‌లోనే కాదు ట్వీట్ల‌లోనూ మ‌న క్రికెట‌ర్లు ఇచ్చిన రిప్లైస్‌కి పాకిస్థాన్ ద‌గ్గ‌ర అస‌లు స‌మాధాన‌మే లేకుండా పోయింది.

4134
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS