ట్విట్ట‌ర్‌లో వీరూకి వైఫ్ కౌంట‌ర్‌

Wed,October 12, 2016 04:22 PM

Virender Sehwag Finally Meets His Match In Wife Aarti, On Twitter

న్యూఢిల్లీ: బుల్లెట్లలాంటి షాట్ల‌తో బౌల‌ర్ల‌కు ఎన్నో నిద్ర‌లేని రాత్రుల‌ను మిగిల్చాడు డాషింగ్ బ్యాట్స్‌మ‌న్ వీరేంద్ర సెహ్వాగ్‌. రిటైరైన త‌ర్వాత కూడా ట్విట్ట‌ర్‌లో త‌నదైన ట్వీట్స్‌తో సెటైర్ల‌ను వేయ‌డంలో వీరూని మించిన‌వాళ్లు లేరు. క్రికెట్‌తోపాటు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో జ‌రుగుతున్న సీరియ‌స్ ఇష్యూస్‌పైన కూడా సెహ్వాగ్ బెదురు లేకుండా త‌ను అనుకున్న‌ది ట్వీట్ చేసేస్తాడు. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్‌పైన కూడా ఓ పంచ్ ట్వీట్ విసిరాడు వీరూ. ఏడో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నందుకు శుభాకాంక్ష‌లు. పెళ్ల‌యిన‌ వ్య‌క్తికే ఇంటికి తొంద‌ర‌గా వెళ్ల‌డంలో ఉన్న ఆతృత తెలుస్తుంది.. అన్న‌ది ఆ ట్వీట్ సారాంశం. ఆ ట్వీట్‌ను అశ్విన్ కూడా లైట్ తీసుకున్నాడు.
అయితే వీరూకి దిమ్మ‌దిరిగే రిప్లై మాత్రం మ‌రోవైపు నుంచి వ‌చ్చింది. ఈ ఇద్ద‌రి ట్వీట్ల‌పై వారి భార్య‌లు కూడా స్పందించారు. తానేమీ అశ్విన్‌ను తొంద‌ర‌పెట్ట‌డం లేద‌ని అత‌ని భార్య ప్రీతి ట్వీట్ చేసింది. నేను మాత్రం తొంద‌ర‌పెట్టానా.. అయినా వీళ్లిద్ద‌రికీ తొంద‌ర ఎక్కువే క‌దా అంటూ సెహ్వాగ్ వైఫ్ ఆర్తి ట్వీట్ చేసింది. వీళ్ల ఆస‌క్తిక‌ర సంభాష‌ణ ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారిపోయింది.


3475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS