కోహ్లి పెళ్లిలో నిజమెంత?Thu,December 7, 2017 11:05 AM

కోహ్లి పెళ్లిలో నిజమెంత?

న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ.. ఈ క్రికెట్, బాలీవుడ్ ప్రేమ పక్షులు పెళ్లి చేసుకోబోతున్నారని రెండేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తొందర్లోనే ఎంగేజ్‌మెంట్ అని, పెళ్లి అని వార్త వచ్చినప్పుడల్లా వీళ్లు అలాంటిదేమీ లేదని చెబుతూనే ఉన్నారు. ఈసారి కూడా డిసెంబర్ 12న ఇటాలియన్ ైస్టెల్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పుడూ అనుష్క శర్మ తరఫు ప్రతినిధి అవన్నీ ఉత్త పుకార్లే అని ఖండించారు. అయినా ఏదో జరగబోతున్నదన్న అనుమానం మాత్రం అభిమానులను వీడటం లేదు. దీనికి కారణం.. కోహ్లిలాగే అతని కోచ్ రాజ్‌కుమార్ శర్మ కూడా సెలవు పెట్టేశాడు. ఢిల్లీ కోచ్‌గా ఉన్న అతను సీకే నాయుడు అండర్ 23 సెమీఫైనల్‌లాంటి కీలకమైన మ్యాచ్‌కు ముందు లీవ్ అడగడం అనుమానాలకు తావిచ్చింది. రాజ్‌కుమార్ సెలవుపై వెళ్లడం నిజమేనని డీడీసీఏ అధికారి కూడా వెల్లడించారు.

అంతేకాదు కోహ్లి క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఇటలీ వెళ్తుండటం కూడా పెళ్లి వార్తలను మరింత బలపరుస్తున్నది. డిసెంబర్ 12న జరగబోయేది పెళ్లా లేక ఎంగేజ్‌మెంటా అన్నది స్పష్టంగా తెలియకపోయినా.. ఏదో ఒకటి జరగబోతున్నదని మాత్రం వీటి ద్వారా స్పష్టమవుతున్నది. ఇక ఈ వేడుక కోసం అనుష్క శర్మ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నాడన్న వార్తలు కూడా వస్తున్నాయి. గత వారం అతను అనుష్క ఇంటికి కూడా వెళ్లాడు. ఈ వేడుకకి కోహ్లి కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానుండగా.. టీమిండియా ప్లేయర్స్‌కు మాత్రం ఇన్విటేషన్ లేదు. అయితే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు ముంబైలో రిసెప్షన్ ఏర్పాటుచేసి టీమ్‌ను పిలవాలని కోహ్లి భావిస్తున్నాడు.

4309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS