పాకిస్థాన్ అభిమానుల మ‌నసు గెలుచుకున్న విరాట్‌!Mon,June 19, 2017 10:46 AM

పాకిస్థాన్ అభిమానుల మ‌నసు గెలుచుకున్న విరాట్‌!

లండ‌న్‌: ఇండియ‌న్ క్రికెట్ టీమ్ చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్లో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మ‌న టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం పాక్ అభిమానుల మ‌న‌సు గెలుచుకున్నాడు. మ్యాచ్ ఓడిన త‌ర్వాత విరాట్ మాట్లాడిన మాట‌లు అక్క‌డి ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. పాక్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు. వాళ్లు అద్భుతంగా ఆడారు. టోర్నీలో వాళ్లు ప‌డి లేచిన తీరు అద్భుతం. ఆ దేశంలో ఎంత టాలెంట్ ఉందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. వాళ్ల‌దైన రోజున ఎలాంటి టీమ్‌నైనా మ‌ట్టిక‌రిపించే స‌త్తా ఉంద‌ని మ‌రోసారి నిరూపించారు అని కోహ్లి మ్యాచ్ త‌ర్వాత అన్నాడు. పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ర్ జ‌మాన్‌పై కోహ్లి ప్ర‌శంస‌లు కురిపించాడు. కోహ్లి ప‌రిణ‌తితో చేసిన కామెంట్స్ పాక్ ఫ్యాన్స్ మ‌ది దోచుకున్నాయి. ట్విట్ట‌ర్‌లో వాళ్లు విరాట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.


మాజీ క్రికెట‌ర్లు బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్‌, షేన్ వార్న్‌లు కూడా కోహ్లిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


7834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS