వరల్డ్‌కప్‌లో ఆడాలంటే ఐపీఎల్‌కు దూరంగా ఉండండి!

Thu,November 8, 2018 05:48 PM

Virat Kohli wants Bhuvi and Bumra to skip IPL for World Cup

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ కొత్త ప్రతిపాదనను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ముందు ఉంచాడు. వరల్డ్‌కప్‌లో ఆడబోయే పేస్ బౌలర్లు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అతడు వాదిస్తున్నాడు. అయితే అతని ప్రతిపాదనను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య హైదరాబాద్‌లో సీఓఏతో జరిగిన మీటింగ్‌లో కోహ్లి ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు. ముఖ్యంగా బుమ్రా, భువనేశ్వర్‌లాంటి పేస్ బౌలర్లను ఐపీఎల్ మొత్తానికి దూరంగా ఉంచాలని అతను కోరాడు. కానీ బోర్డు సభ్యుల మద్దతు అతనికి లభించలేదు. ఫ్రాంచైజీలు అందుకు అంగీకరించబోవని వాళ్లు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ఐపీఎల్ మార్చి 29న ప్రారంభమై, మే 19న ముగుస్తున్నది. జూన్ 5న వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌ను సౌతాఫ్రికాతో ఇండియా ఆడనుంది. అంటే 15 రోజుల సమయం ఉంటుంది. అందువల్ల పేస్‌బౌలర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశమే లేదు అని బోర్డుకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు.

కోహ్లి ఈ ప్రతిపాదన తెచ్చిన వెంటనే అక్కడే ఉన్న రోహిత్‌ను తన అభిప్రాయం చెప్పాల్సిందిగా సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ కోరారు. దానికి అతడు స్పందిస్తూ ఒకవేళ ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకొని బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటే అతన్ని వదులుకోలేను అని రోహిత్ సమాధానమిచ్చాడు అని సదరు అధికారి తెలిపారు. అందరు ప్రధాన పేస్ బౌలర్లకు రెస్ట్ ఇవ్వాలని కోహ్లి కోరడం వింతగా ఉందని మరో అధికారి అన్నారు. ఇక ఆ ఇద్దరు ప్రధాన బౌలర్లను ఐపీఎల్ మొత్తానికి దూరం చేస్తే వాళ్లకు వరల్డ్‌కప్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు కదా అన్న వాదన కూడా ఆ సమావేశంలో చర్చకు వచ్చినట్లు ఆ అధికారి వెల్లడించారు.

4951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles