విరాట్‌ను బ‌లిప‌శువును చేస్తున్నారు!

Sun,June 25, 2017 04:55 PM

Virat Kohli unreasonably being targeted says Anurag Thakur

హ‌ర్మీర్‌పూర్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మొత్తానికి మ‌ద్ద‌తిచ్చే వ్య‌క్తి ఒక‌రు దొరికారు. అనిల్ కుంబ్లే రాజీనామా విష‌యంలో కోహ్లిని అన‌వ‌స‌రంగా ఆడిపోసుకుంటున్నార‌ని బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. అంతేకాదు ఈ ఎపిసోడ్‌పై ప్ర‌స్తుత బోర్డు మేనేజ్‌మెంట్ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని డిమాండ్ చేశారు. విరాట్‌ను అన‌వ‌స‌రంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది ఇక్క‌డితో ఆపేయండి. వ‌చ్చే ప‌దేళ్ల‌లో ఇండియ‌న్ క్రికెట్‌ను కొత్త ఎత్తుల‌కు తీసుకెళ్లే స‌త్తా కోహ్లికి ఉంది. ఓ క్రికెటర్‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ కెప్టెన్లు, మాజీ కెప్టెన్ల‌ను ఇలాగే ఆడిపోసుకున్నారు అని ఠాకూర్ అన్నారు.

తాను అధ్య‌క్షుడిగా ఉండి ఉంటే.. ఈ అంశాన్ని స‌మ‌ర్థంగా డీల్ చేసి ఉండేవాళ్ల‌మ‌ని ఆయ‌న చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు త‌ర్వాత ఠాకూర్ త‌న ప‌ద‌విని కోల్పోయిన విష‌యం తెలిసిందే. లోక్‌స‌భ ఎంపీ అయిన అనురాగ్‌.. ప్ర‌స్తుతం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ఒలింపిక్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్నారు. తాము ఉన్న‌పుడు క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తూనే.. కుంబ్లేకు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చి ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే కొత్త కోచ్‌ను నియ‌మించేందుకు కావాల్సిన వెసులుబాటును బోర్డుకు క‌ల్పించామ‌ని ఠాకూర్ గుర్తుచేశారు. ఈ వివాదంపై ప్ర‌స్తుత బోర్డు స‌భ్యులు చెప్పాల్సింది చాలా ఉంద‌ని ఆయ‌న అన్నారు. కుంబ్లే కోచ్ అయిన ఏడు, ఎనిమిది నెల‌ల వ‌ర‌కు తామే బోర్డులో ఉన్నామ‌ని, ఆ స‌మ‌యంలో ఈ విభేదాల గురించి అసలు ఒక్క వార్త కూడా రాలేద‌ని ఠాకూర్ చెప్పారు.

3582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles