భారత్‌లో పవర్‌ఫుల్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Fri,January 11, 2019 04:51 PM

యూత్ ఐకాన్‌గా నిలిచిన రన్‌మెషీన్, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగులు మాత్రమే కాదు.. సంపాదనలోనూ దూసుకెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న విరాట్ భారత్‌లో దిగ్గజ సెలబ్రిటీలకు దీటుగా అత్యధికంగా ఆర్జిస్తున్నాడు. భారత్‌లో అత్యంత పవర్‌ఫుల్ సెలబ్రిటీ బ్రాండ్స్ లిస్టును గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వైజర్స్ సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫ్స్ విడుదల చేసింది.


మళ్లీ కోహ్లీనే టాప్.. బ్రాండ్ విలువ రూ.1200కోట్లు!

దేశంలో అత్యధిక బ్రాండ్ విలువ కలిగిన జాబితాలో కోహ్లీ వరుసగా రెండోసారి అగ్రస్థానం సాధించాడు. 2017 కంటే 2018లో ఈసారి అతడి విలువ 18శాతం పెరిగి సుమారు రూ.1200(బ్రాండ్ వాల్యూ 170.9 మిలియన్ అమెరికా డాలర్లు) కోట్లకు చేరింది. గతేడాది నవంబర్ వరకు కోహ్లీ 24 బ్రాండ్లకు ప్రచారం చేశాడు. 2018లో కొత్తగా ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఉబెర్, టూ యమ్ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడు. నేను వాడని, నమ్మకం లేని వాటికి అంబాసిడర్‌గా చేయలేనని పెప్సీ అంబాసిడర్‌గా కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే.

20 మందితో దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీ బ్రాండ్ జాబితాను రూపొందించారు. 21 బ్రాండ్లు కలిగిన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రూ.720 కోట్లతో రెండో స్థానంలో ఉంది. అక్షయ్ కుమార్($67.3 million), రణ్‌వీర్ సింగ్($63 million) చెరో ఒక స్థానం చొప్పున ఎగబాకి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్($60.7 million) ఐదో స్థానానికి పడిపోయాడు. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, వరుణ్ ధావన్, హృతిక్ రోషన్ టాప్-10లో కొనసాగుతున్నారు. ధోనీ($26.9 million) 12వ స్థానంలో.. సచిన్ టెండూల్కర్($21.7million) 15వ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు($21.6 million) 15వ స్థానంలో ఉంది.

3400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles