ఒక్కసారి రిటైరైతే మళ్లీ బ్యాట్ పట్టుకోను!

Fri,January 11, 2019 05:01 PM

Virat Kohli talks about his retirement before first ODI against Australia

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన విరాట్.. ఓ ప్రశ్నకు బదులుగా రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ఒకవేళ రిటైరైన తర్వాతగానీ లేదా బీసీసీఐ అనుమతిస్తే ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో ఆడతారా అని ప్రశ్నించగా.. ఒక్కసారి రిటైరైతే ఇక జీవితంలో బ్యాట్ పట్టుకోను అని కోహ్లి స్పష్టం చేశాడు. భవిష్యత్తులో బీసీసీఐ నిర్ణయం మారుతుందో లేదో నాకు తెలియదు. నా విషయానికి వస్తే ఒకసారి క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత మళ్లీ ఆడటమనేది జరగదు అని కోహ్లి అన్నాడు. ఏబీ డివిలియర్స్, మెక్‌కల్లమ్‌లాంటి క్రికెటర్లు రిటైరైన తర్వాత కూడా ఐపీఎల్‌తోపాటు పలు క్రికెట్ లీగ్స్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాను మాత్రం ఆ కోవకు చెందిన వాడిని కాదు అని విరాట్ తేల్చి చెప్పాడు. గత ఐదేళ్లలో చాలా క్రికెట్ ఆడాను. రిటైరైన తర్వాత మళ్లీ బ్యాట్ పడతానని కూడా అనుకోవడం లేదు. ఇంకా క్రికెట్ ఆడతాను. చాలు అనుకుంటే ఆపేస్తాను. ఇక అంతే. మళ్లీ దాని జోలికే వెళ్లను అని కోహ్లి అన్నాడు.


4768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles