కోహ్లీ సెంచ‌రీ.. భార‌త్ 209/4

Sun,December 16, 2018 08:47 AM

Virat Kohli Still Going Strong

పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న‌ది. ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్న టెస్ట్‌లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. కంగారూల‌ని 326 ప‌రుగుల‌కి క‌ట్టడి చేసిన భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి మూడు వికెట్ల న‌ష్టానికి 172 ప‌రుగులు చేసింది. మూడు రోజు ఆటలో తొలి ఓవ‌ర్‌లోనే అజింక్యా ర‌హానే(51) వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన విహారితో క‌లిసి కోహ్లీ స్కోరు బోర్డుని ప‌రుగులెత్తిస్తున్నాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్‌లో త‌న 25వ‌ సెంచ‌రీ పూర్తి చేశాడు. కోహ్లీ, విహారీలు ఆసీస్ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ స్కోర్ బోర్డ్‌ని ముందుకి న‌డిపిస్తున్నారు. విహారీ (18; 2 ఫోర్స్‌) ప‌రుగులు చేశాడు. మొత్తంగా భార‌త్ 4 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. మ‌రో రెండు రోజులు మిగిలున్న టెస్ట్‌లో మొగ్గు ఎవరికనేది ఉత్కంఠగా మారింది.

4958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles